భార‌త్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్‌

- December 18, 2021 , by Maagulf
భార‌త్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్‌

న్యూ ఢిల్లీ: భారత్‌లో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి.స్పామ్ కాల్స్ పై ట్రూకాల‌ర్ ఓ నివేదిక‌ను త‌యారు చేసింది.ఈ నివేదిక ప్ర‌కారం దేశంలో రోజు రోజుకు స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయ‌ని, గ‌తేడాది స్పామ్ కాల్స్ విష‌యంలో 9 వ స్థానంలో ఉన్న భార‌త్‌,ఈ ఏడాది 4 వ స్థానానికి చేరిందని ట్రూకాల‌ర్ పేర్కొన్న‌ది.ఓ స్పామ్ కాల్ నెంబ‌ర్ నుంచి 6 ల‌క్ష‌ల 40 వేల మందికి 20 కోట్ల సార్లు కాల్స్ వెళ్లాయ‌ని ట్రూకాల‌ర్ తెలియ‌జేసింది.దీన్ని బ‌ట్టి దేశంలో స్పామ్ కాల్స్ ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌తి గంట‌కు 27 వేల మందికి  స్పామ్ కాల్స్ వెళ్లిన‌ట్టు నివేదిక‌లో పేర్కొన్న‌ది.  ప్ర‌పంచంలో స్పామ్ కాల్స్‌ను ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ మొద‌టి స్థానంలో ఉండ‌గా, పెరూ రెండో స్థానంలో నిలిచింది.  స్పామ్ కాల్స్‌లో అత్య‌థిక‌శాతం మార్కెటింగ్ లేదా టెలిమార్కెటింగ్ కోస‌మే చేసిన‌వ‌ని ట్రూకాల‌ర్ పేర్కొన్న‌ది. అక్టోబర్‌ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com