జనవరి 26న ఆశిష్ గాంధీ,చిత్రా శుక్ల కాంబినేష‌న్‌లో 'ఉనికి'

- December 19, 2021 , by Maagulf
జనవరి 26న ఆశిష్ గాంధీ,చిత్రా శుక్ల కాంబినేష‌న్‌లో \'ఉనికి\'

హైదరాబాద్: 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, 'రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేష‌న్‌లో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన సినిమా 'ఉనికి'. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ..."ఇదొక డ్రామా థ్రిల్లర్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి.ఈ నెలాఖరున సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరి 26వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నాం.కథ విషయానికి వస్తే... సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువతి, కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని ముందుకొచ్చిన ఆవిడకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన 'ఉనికి'ని చాటుకుంది? అనేది సినిమా.అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే సినిమాలో రెండు పాటలు విడుదల చేశాం. రెండిటికీ మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన 'నిప్పు రవ్వ కదిలింది చూడు...' పాటకు విశేష స్పందన లభించింది. అంతకు ముందు రాక్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది" అని అన్నారు. 

టీఎన్ఆర్, 'రంగస్థలం' నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద,  రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), కాస్ట్యూమ్స్ - రూప రేఖ గుత్తి, సహ నిర్మాత: అడ్డాల రాజేష్, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com