భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..

- December 20, 2021 , by Maagulf
భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..

కువైట్ సిటీ: కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.ఈ నెల 22న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. మధ్యహ్నం 3.30 గంటలకు ఈ  కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొంది.కువైట్ లో పని చేస్తున్న ఇంజినీర్లు, నర్సుల సమస్యలపై ఈ కార్యక్రమంలో అంబాసిడర్ సిబి జార్జి చర్చించనున్నట్టు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు.. ఎంబసీ కార్యలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఈ  కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకావొచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనదలచిన భారతీయులు [email protected]‌కు  మొయిల్ పంపి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. భారతీయులు ఎవరైనా ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. వారి సమస్యను పాస్‌పోర్ట్ నెంబర్, పేరు, సివిల్ ఐడీ నెంబర్, ఫోన్ నంబర్ వివరాలతో మెయిల్ చేయాలని తెలిపింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com