విదేశాల నుంచి వచ్చే వారికి అలర్ట్..
- December 20, 2021
న్యూ ఢిల్లీ:కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ.. భయాందోళనలకు గురి చేస్తోంది.ఈ క్రమంలో ప్రపంచ దేశాలు.. తిరిగి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.ఇందులో భాగంగానే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి.. భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. ముందుగానే ఆన్‌లైన్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం ‘ఎయిర్ సువిధా’ పోర్టల్‌లో తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలసిందే. కాగా.. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇకపై ఇండియాకు వచ్చే ముందే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ‘ఎయిర్ సువిధా’ పోర్టల్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే.. గత 14 రోజుల ట్రావెల్ హిస్టరీలో ‘ఎట్ రిస్క్’ దేశాల్లో పర్యటించినట్లు ఉన్నట్లైతే.. సదరు ప్రయాణికులకు కూడా ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ముందుగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకునే వారి కోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో కరోనా పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ‘ఎట్ రిస్క్’ దేశాల జాబితాలో బ్రిటన్‌తోపాటు యూరప్ దేశాలు ఉన్నాయి. అంతేకాకుండా.. దక్షణాఫ్రికా, బ్రెజిల్, చైనా, న్యూజిలాండ్, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాలను కూడా భారత ప్రభుత్వం ‘ఎట్ రిస్క్’ దేశాల జాబితాలో చేర్చింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







