ఉద్యోగుల సెలవలు రద్దు..కువైట్ నిర్ణయం

- December 23, 2021 , by Maagulf
ఉద్యోగుల సెలవలు రద్దు..కువైట్ నిర్ణయం

 కువైట్: ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 26 నుండి జనవరి 31, 2022 వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి సంబంధించిన పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అని ప్రకటించింది ఆరోగ్య శాఖ.

బుధవారం, కువైట్‌లో 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా, రోజువారీ కోవిడ్ కేసులు 143 కి చేరుకోవటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com