వారాంతంలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ కేంద్రం

- December 23, 2021 , by Maagulf
వారాంతంలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ కేంద్రం

కువైట్: నార్త్ వెస్ట్ నుంచి చల్లని వాతావరణం, కువైట్ నగరంలో మరింత చల్లదనాన్ని కలిగించనుంది. వారాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కువైట్ కంట్రోల్ అండ్ మిటియరలాజికల్ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కెసిఎంసి నావల్ ఫోర్‌కాస్ట్ సూపర్‌వైజర్ యాసిర్ అల్ బ్లౌషి మాట్లాడుతూ, గాలుల వేగం 8 నుంచి 20 కిలోమీటర్ల వరకు వుంటుందనీ, చల్లటి గాలులు వీస్తాయనీ పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో సాధారణ వాతావరణమే వుంటుంది. ఆకాశం కొంతమేర మేఘావృతమై వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com