కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు, కేఫ్‌లపై చర్యలు
- December 25, 2021
బహ్రెయిన్: ఎల్లో అలర్ట్ లెవల్ ముందస్తు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు,కేఫ్‌లపై పరిశ్రమ, వాణిజ్యం,పర్యాటక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది.నిబంధనలు పాటించని ఒక రెస్టారెంట్‌ను మూసివేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ,హెల్త్ మినిస్ట్రీ, బహ్రెయిన్ ఎగ్జిబిషన్ అండ్ టూరిజం అథారిటీ (BTEA) సహకారం, సమన్వయంతో నిన్న క్యాపిటల్ గవర్నరేట్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లలో భాగంగా హెల్త్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన 28 రెస్టారెంట్లు,కేఫ్‌లకు నోటీసులు అందజేశారు.ఇదే సమయంలో 23 సెలూన్లను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా లేని ఇద్దరు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని, నిబంధనలు పాటించని వాటి సమాచారాన్ని తెలపాలని పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







