ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
- December 27, 2021కువైట్: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పోరుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజా పరిణామాలను గమనిస్తున్నామని, ఒమిక్రాన్ తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ ఛైర్మన్, ప్రభుత్వ ప్రతినిధి తారెక్ అల్-మెజ్రేమ్ ఆదివారం తెలిపారు. ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా అధ్యక్షతన బయాన్ ప్యాలెస్లో కోవిడ్-19 పై చర్చించేందుకు మంత్రుల కమిటీ సమావేశమైంది. సమావేశం తర్వాత అల్-మెజ్రెమ్ మాట్లాడుతూ.. అర్హులైన వారు బూస్టర్ డోస్ పొందాలని, కరోనా నియంత్రణ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు