జిసిసి వలసదారులకు యూఏఈ ఇ-వీసా తప్పనిసరి
- March 25, 2016
జిసిసి వలసదారులు యూఏఈలోకి ప్రవేశించలంటే ఆన్లైన్ ఇ-వవీసా తప్పనిసరి. మార్చ్ 29 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రయాణీకులకు, ట్రావెల్ ఏజెంట్లకు యూఈఏ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టమైన సమాచారం పంపించారు. కొన్ని వర్గాలకు చెందిన జీసీసీ వలసదారులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఈ-వీసాను ముందే పొందాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ స్పష్టం చేసింది. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. మస్కట్‌లోని ఎయిర్ అరేబియా అధికారులు మాత్రం ఈ విషయమై తమకు సమాచారం లేదన్నారు. తాజా నిబంధనల ప్రకారం యూఏఈ వీసా పొందే జిసిసి నివాసితుడికి ఎంట్రీ పర్మిట్ 30 రోజుల వరకు ఉంటుంది, ఎంట్రీ అయ్యాక 30 రోజులపాటు ఇది చెల్లుబాటు అవుతుంది. దీన్ని 60 రోజుల వరకు పెంచుకోవచ్చు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







