రోడ్డుపై వెళ్తున్న కుటుంబంపై కన్ఫెట్టీ స్ప్రే చేసిన యువకులు అరెస్ట్
- December 27, 2021
ఖతార్: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ కుటుంబంపై కాన్ఫెట్ స్ప్రే చేసిన యువకులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MoI) అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వీడియోలో హల్ చల్ చేసిన 12-15 సంవత్సరాల మధ్య వయస్సు గల నిందితులను పట్టుకున్నామని, వారి వయస్సు కారణంగా వారి పేర్లను వెల్లడించేందుకు వీల్లేందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని MoI ప్రజలకు హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









