శ్రీవారి భక్తులకు అలెర్ట్...
- December 27, 2021
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ముఖ్యంగా సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది టీటీడీ.. అదే విధంగా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. మరోవైపు.. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.. మరోవైపు.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా… మరోసారి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై క్లారిటీ ఇచ్చింది టీటీడీ.. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులుకు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







