పెరుగుతున్న కోవిడ్ కేసులు..అబుధాబి కొత్త ఆంక్షలు
- December 28, 2021
యూఏఈ: కోవిడ్ నుండి కాస్త ఉపశమనం లభించి ప్రజలు సామాన్య జీవితానికి మెల్లి మెల్లిగా వస్తున్న తరుణంలో కొవిడ్-19 మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తోంది. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. సభలు, సమావేశాలు, వేడుకలు జరుపుకునే వారిని ఉద్దేశిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆ రూల్స్ అమలులోకి వచ్చినట్టు తెలిపింది.
ఇళ్లలో చేసుకునే వేడుకులను కేవలం 30 మందితో మాత్రమే జరుపుకోవాలని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునే వేడుకలు, సమావేశాలకు గరిష్టంగా 150 మందికి మించి హాజరుకావొద్దని తెలిపింది. అలాగే ఇండోర్ ఈవెంట్లలో 50 మంది పాల్గొనొచ్చని పేర్కొంది. కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 26 నుంచే అమలులోకి వస్తాయని ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలందరూ కొవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







