ముంబైలో నిబంధనలు మరింత కఠినం
- December 31, 2021
ముంబై: ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు.రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకల పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్‌లో అనుమతులను నిరాకరించారు.
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లో సందర్శకులను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ఈ నిబంధనలు డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వ తేదీ వరకు అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలియజేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 198 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు రావడంతో అధికారులు దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







