హైదరాబాద్ చేరుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా..
- January 04, 2022
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసిన జైలుకు పంపించారు. దీంతో ఆయనకు మద్దతుగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాకతో హైదరాబాద్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిచలేమని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ చేసిన తీరుతామని బీజేపీ శ్రేణులు భీష్మించి కూర్చున్నారు. సికింద్రాబాద్ మహాత్మ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్‌లో పోలీసులు ప్రత్యేక బలగాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నడ్డా పర్యటన సందర్భంగా శంషాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, రాంచంద్రరరావు, ప్రేమేందర్‌రెడ్డిలో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, అనంతర పరిణామాలను పార్టీ నేతలు నడ్డా దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి