కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు..
- January 04, 2022
హైదరాబాద్: కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు కోరింది. రాష్ట్రంలో కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబసభ్యులు దీనికి అర్హులు. కరోనాతో చనిపోయిన వారి సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఇందుకోసం మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ తెలిపింది. అందుకోసం తమ బంధువు కోవిడ్ తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో అప్లయ్ చేసుకోవాలంది. ఈ దరఖాస్తులో బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర అవసరమైన పత్రాలు జత పరచాలని తెలిపింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కోవిడ్ డెత్ నిర్దారణ కమిటీ.. కోవిడ్ 19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విచారణ జరిపి మరణించిన వారి సమీప బంధువుల ఖాతాల్లో ఎక్స్-గ్రేషియా మొత్తం జమ చేస్తారు.
రాష్ట్రంలోని 4వేల 500 మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు మీ-సేవా ఫోన్ నెంబర్ 040 -48560012 సంప్రదించాలన్నారు. అలాగే [email protected] అనే మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







