భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
- January 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.తాజాగా భారత్‌లో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి.మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఒక్కరోజులో కొత్తగా 20 వేలకు పైగా కేసులు పెగరడం ఆందోళన కలిగిస్తోంది.భారత్‌లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది.ఇది అందోళన కలిగించే అంశంగా చెప్పాలి.ఇక 24 గంటల్లో 15,389 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా భారీగా పెరిగింది. 24 గంటల్లో కరోనాతో 534 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నది.ప్రస్తుతం భారత్‌లో 2,14,004 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 3,43,21,803 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు 4,82,551 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. న్యూఇయర్ వేడుకల తరువాత కేసులు భారీగా నమోదవుతున్నాయి.వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది.కొత్త సంవత్సరం వేడుకల తరువాత కేసులు మూడు రెట్లు వరకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.రాబోయే రోజుల్లో ఈ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 147.72 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి