12 దేశాల ప్రయాణీకులకు కొత్త కండిషన్స్ పెట్టిన యూఏఈ

- January 05, 2022 , by Maagulf
12 దేశాల ప్రయాణీకులకు కొత్త కండిషన్స్ పెట్టిన యూఏఈ

యూఏఈ: కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై యూఏఈ కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 12 దేశాల నుండి దుబాయ్‌కి ప్రయాణించే ప్రయాణీకులు 48 గంటల చెల్లుబాటుతో నెగెటివ్ కోవిడ్-19 PCR సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2, 2022 నుండి UK నుండి దుబాయ్‌కి ప్రయాణించే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా బయలుదేరడానికి 48 గంటల ముందు తీసుకున్న నెగటివ్ కోవిడ్-19 PCR పరీక్ష ప్రమాణపత్రాన్ని కలిగి ఉండాలన్న నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన వెబ్‌సైట్‌లోని తాజా అప్‌డేట్‌లో ఈ మేరకు మార్పులు చేసింది. ఇకపై RT PCR పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఎక్కడ తీసుకున్నారో కూడా పేర్కొనాల్సి ఉంటుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి ప్రయాణానికి NHS కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్‌లు ఆమోదించబడవని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com