హీరో నవదీప్‌కి చెందిన ఫాంహౌస్‌పై ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు
- March 25, 2016
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్‌కి చెందిన ఫాంహౌస్‌పై ఎక్సైజ్, పోలీసు అధికారులు ఉమ్మడిగా దాడులు చేపట్టారు. కొందరు హీరోలు, మరికొందరు నటులు పరారైనట్టు సమాచారం. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఫారెన్ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చక్రంపల్లిలో హీరో నవదీప్‌కు ఫాంహౌస్ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని, సినీ ప్రముఖులు మద్యం తాగుతూ డ్యాన్సులతో హంగామా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే దాడులు నిర్వహించారు.రేవ్ పార్టీ మేనేజర్ అరుణ్ సాయిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల రాకను గమనించి నవదీప్, అతడి ఫ్రెండ్స్ అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. కాగా, ఓ నటుడ్ని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.ఆ నటుడు ఎవరు అనేది తెలియాల్సివుంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







