నెదర్లాండ్స్ అగ్నిప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి!
- January 07, 2022
హెగ్: నెదర్లాండ్స్ రాజధాని హెగ్‌లోని ఓ భవంతిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్‌కి చెందిన అబ్దుల్ హదీ (43) గత కొన్నేళ్లుగా నెదర్లాండ్స్‌లోని హెగ్లో నివశిస్తున్నాడు. అతనికి నెదర్లాండ్‌కి సంబంధించిన పర్మినెంట్ వీసా కూడా ఉంది. కాగా జనవరి 5న అతను నివశిస్తున్న ష్విల్డెర్‌షిజ్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ.. 24 గంటల అనంతరం మృతి చెందాడు.
కాగా, అబ్దుల్ హాదీ గత సంవత్సరం 2021 జనవరిలో భారత్‌కి వచ్చి... మార్చి నెలలో నెదర్లాండ్స్‌కి తిరిగి వెళ్లాడు. మళ్లీ త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానన్న కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కి తరలించాలంటూ.. భారత విదేశాంగ శాఖామంత్రి, నెదర్లాండ్స్ ఇండియన్ ఎంబసీ అధికారులకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి