మహారాష్ట్రలో కరోనా విజృంభణ...
- January 07, 2022
ముంబై: భారత దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అయితే దీంతో ఈ వేరియంట్ పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 20,971 కొత్త కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.
అయితే మహారాష్ట్రలో 20 వేల కేసులు దాటితే లాక్డౌన్ విధిస్తామని మహా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు సంఖ్య ప్రకారం మహాలో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేరళలో కొత్తగా 5,296 కరోనా కేసులు రాగా, 35 మంది మరణించారు. దీంతో పాటు కొత్తగా 25 ఒమిక్రాన్ కేసులు కూడా కేరళలో నమోదవడంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 305కు చేరింది. అలాగే కర్ణాటకలో 8,449, గోవాలో 1,432 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







