ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్న 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్
- January 07, 2022
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న కేసులో 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 283 కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.మరోవైపు, మోదీ పర్యటన సందర్భంగా వెలుగుచూసిన ‘తీవ్రమైన భద్రతా లోపం’పై కేంద్రం నియమించిన ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించింది. ఇంకోవైపు, పంజాబ్ ప్రభుత్వం కూడా దీనిపై కేంద్రానికి నివేదిక అందించింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని తెలియజేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్‌కు కేబినెట్ సెక్రటేరియర్ కార్యదర్శి (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా సారథ్యం వహిస్తుండగా, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఐజీ ఎస్ సురేశ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ ఉదయం ఫిరోజ్‌పూర్‌లోని ప్యారాయణ ఫ్లై ఓవర్‌ను సందర్శించిన దర్యాప్తు బృందం పంజాబ్ పోలీస్ సీనియర్ అధికారి, ఇతర అధికారులను కలిసి వివరాలు సేకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పైనే ఉన్న బృందం ఆ తర్వాత దర్యాప్తు నిమిత్తం బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







