ఏపీలో నైట్ కర్ఫ్యూ..
- January 10, 2022
అమరావతి: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అలాగే థియేటర్లు, మాల్స్‌లో 50 శాతం అక్యుపెన్సీ ఉండాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసారు. అటు ప్రార్ధనా మందిరాలలో కూడా కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి, భౌతిక దూరం వంటి నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయనున్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







