ఇస్రో ఛైర్మన్ గా ఎస్.సోమనాథ్ నియామకం
- January 12, 2022
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్ గా అంతరిక్ష శాఖ కార్యదర్శి రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియామించారు.
తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు.
కేరళకు చెందిన ఎస్.సోమనాథ్.. కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో యూజీ డిగ్రీ, భారతదేశం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1985లో సోమనాథ్ ఇస్రోలో చేరారు.
కేరళ శాస్త్రవేత్తలు జి.మాధవన్ నాయర్, డాక్టర్ కె.రాధాకృష్ణన్ 2003 నుంచి 2014వరకు అంతిరక్ష సంస్థకు నాయకత్వం వహించారు. ఎస్.సోమనాథ్.. అగ్రస్థానికి చేరుకున్న మూడో మలయాళీ కావడం విశేషం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి