త్వరలో ‘మోహన్‌బాబు యూనివర్సిటీ’
- January 13, 2022
హైదరాబాద్: హీరోగా, విలన్ గా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు పరిశ్రమలో ఉంటూ ఎన్నో మంచి సినిమాలని అందించిన సీనియర్ నటుడు మోహన్ బాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాక విద్యారంగంలో కూడా రాణిస్తున్నారు. 1993లో తిరుపతిలో శ్రీ విద్యానికేతన్‌ను అనే విద్యాసంస్థని స్థాపించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యావంతుల్ని ఆయన విద్యాసంస్థల నుంచి తీర్చిదిద్దుతున్నారు.
తాజాగా మరో కీలక విషయం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోహన్ బాబు. త్వరలో “మోహన్ బాబు యూనివర్సిటీ”ని ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ”శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ