తెలంగాణలో లాక్‌డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
- January 14, 2022
తెలంగాణ: కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు..కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు.. ట్విట్టర్‌లో మరోసారి ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్ల ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. తమ సుస్థిర, సుపరిపాలనే భాజపా విద్వేష ప్రచారానికి తమ సమాధానమని కేటీఆర్ అన్నారు. భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని.. తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు..
ఇక, లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూపై కూడా మంత్రి కేటీఆర్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి.. దీనిపై స్పందించిన ఆయన.. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.. అయితే, ప్రస్తుతం కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి ఆలోచనలు మాత్రం లేనట్టుగా తెలుస్తోంది.. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కేసులు పెరుగుతూ పోతున్నందున.. సంక్రాంతి హాలీడేస్ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనేదానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







