23ఏళ్ల తరవాత భారత్ కు చేరుకున్న వలసదారుడు

- January 14, 2022 , by Maagulf
23ఏళ్ల తరవాత భారత్ కు చేరుకున్న వలసదారుడు

మనామా: 23ఏళ్ల క్రితం అతడు బహ్రెయిన్ కి వలస వెళ్లాడు.అక్కడ దొరికిన పని చేస్తూ కుటుంబ సభ్యులకు డబ్బులు పంపిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు.ఫలితంగా ఏళ్లపాటు కుటుంబానికి దూరమయ్యాడు.ఎట్టకేలకు తాజాగా అతడు భారత్ కు చేరుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..భారత్ కు చెందిన సిబి మాథ్యూ ఉపాధి కోసం తొలిసారిగా 1991లో బహ్రెయిన్ వెళ్లాడు.అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేరాడు.ఈ క్రమంలోనే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇండియాకు వస్తూ కుటంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేవాడు. ఇలా 1995లో భారత్ కు వచ్చి.. తిరిగి వెళ్లిన తర్వాత సిబి మాథ్యూ అనుకోకుండా అక్కడ కొన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. దీంతో ఇంటికి రాలేక, అక్కడ ఉండలేక కిడ్నీ సమస్యలతో బాధపడుతూ 23ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాజాగా ఈయన విషయం ఇండియన్ ఎంబసీ దృష్టికి వచ్చింది. దీంతో బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ అధికారులతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించడంతో సిబి మాథ్యూ స్వదేశానికి రావడానికి మార్గం సుగమం అయింది.ఈ నేపథ్యంలోనే మాథ్యూ గురువారం రోజు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ కు బయల్దేరాడు.ఈ సందర్భంగా మాథ్యూ మాట్లాడుతూ.. తనకు సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com