టీసీఎస్‌లో ఉద్యోగాలు...

- January 14, 2022 , by Maagulf
టీసీఎస్‌లో ఉద్యోగాలు...

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.ఇప్పటికే టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ 2022, టీసీఎస్ స్మార్ట్‌ హైరింగ్‌ 2022 ప్రోగ్రామ్స్‌కు అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇప్పుడు టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ (TCS MBA Hiring) ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తుల్ని కోరుతోంది.

ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ద్వారా గతేడాది దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంబీఏ పాస్ అయినవారికి, చదువుతున్నవారికి మరో అవకాశం ఇస్తోంది టీసీఎస్. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి 2022 జనవరి 16 వరకు అవకాశం ఉంది. టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ టెస్ట్స్ 2021 నవంబర్ 21న ప్రారంభమయ్యాయి.

బ్యాచ్‌ల వారీగా నిరంతరం పరీక్షలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఎగ్జామ్ వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైనవారికి పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను వెల్లడిస్తుంది టీసీఎస్. టెస్ట్‌, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసినవారిని 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీరిని నియమించనుంది టీసీఎస్.

టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించి విద్యార్హతల వివరాలు చూస్తే 2022, 2021 లో ఎంబీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. 2022 లో ఎంబీఏ పాస్ అయ్యేవారు అంటే ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. 

టీసీఎస్ ఎంబీఐ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/management-hiring-yop-2020-2022 లింక్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి. 

అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ముందే రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు. మోడ్ ఆఫ్ టెస్ట్ రిమోట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి. Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ స్మార్ట్ హైరింగ్, ఎంబీఐ హైరింగ్ లాంటి వేర్వేరు ప్రోగ్రామ్స్‌తో వేల సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమిస్తోంది. ఈ ప్రోగ్రామ్స్‌కు బ్యాచ్‌ల వారీగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టీసీఎస్‌లో ఫ్రెషర్స్ ఉద్యోగాలు కోరుకునేవారు https://www.tcs.com/careers/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com