ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్

- January 16, 2022 , by Maagulf
ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్

ఒమన్: అల్ సలీల్ నేచురల్ పార్క్‌లో ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సఫారీ ప్రాజెక్ట్‌ ముగింపు దశకు చేరుకుంది. పలుప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెవలప్మెంట్ కు ఎన్విరాన్‌మెంట్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించాలనుకునే కంపెనీలు, ప్రత్యేక సంస్థలు, పెట్టుబడిదారులకు ఎన్విరాన్‌మెంట్ అథారిటీ కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ధోఫర్ గవర్నరేట్ (సౌలి, దహరిజ్, ఖోర్ అల్ ఖురుమ్ అల్ కబీర్)లోని మూడు ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ప్రకటన చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com