కాంతుల 'సంక్రాంతి'
- January 16, 2022తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల పండుగ
ధనుర్మాసారంభం ఆధ్యాత్మికత సమైక్యత పండుగ
పల్లెలన్ని మురిసి మెరిసిపోయే నిండైన పండుగ
చలిపులికి వెరవక భానుడి వెలుగులు గోచరించకముందే ముంగిళ్ళలో రంగురంగుల రంగవల్లులతో భూమాతని అతివలు ముస్తాబుచేసి గొబ్బెమ్మలు తంగేడు పూలతో అలంకరించి గుమ్మాలకి మామిడితోరణాల శోభనొసగి
ముద్దుగారే ముద్దబంతులు ఆహ్వానం పలికే పండుగ
భగభగమండే భోగభాగ్యాలతో చెడుని తరిమికొట్టి
మంచికోరుతు చిన్నారులని దీవించె భోగిపండ్ల పండుగ
కొత్త పంటరాకతో కళకళలాడే రైతన్నల ఆశలకి
సేద్యంలో తోడైన గోమాతని పూజించే పండుగ
నోరూరించే ఘమఘమలు పిండివంటల పండుగ
కొత్త ధాన్యంతో పొంగిపోయే పొంగళ్ళు పండుగ
మదిమదిలో ఉప్పొంగే ఆనంద పరవళ్ల పండుగ
అంబరాన్నంటే పతంగులు ఎగురవేయు పండుగ
పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకునే పండుగ
నూతనవస్త్ర ధారణతో ఇంటిల్లిపాదీ మురిసే పండుగ
చిన్నపెద్ద బంధువులతో ఉరుకుల పరుగుల కేరింతలతో
కొత్త అల్లుళ్ళ రాకతో బావమరదళ్ళు ఆటపాటలతో
కోలాటాలతో కోలాహలంగా సాగిపోయే పండుగ
హరిదాసు బసవన్న ఆటపాటల కోడిపందాల పండుగ
ఏటేటా నవ్యక్రాంతులు మోసుకొచ్ఛే కొత్త సంక్రాంతి
తెలుగు భాష తియ్యదనం గొప్పదనం తెలుసుకున్న
ప్రతి తెలుగువారు మన వారసత్వం నిలుపుకుంటూ శాంతి సౌభాగ్యాలతో కొత్త వెలుగులు నింపాలని కోరుకునే పండుగ తెలుగువారి పండుగగా అవతరించింది మకరసంక్రాంతి.
--యామిని కొళ్లూరు(అబుధాబి)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం