‘ఆహా’ లో మరో అదిరిపోయే థ్రిల్లర్..

- January 16, 2022 , by Maagulf
‘ఆహా’ లో మరో అదిరిపోయే థ్రిల్లర్..

హైదరాబాద్: తెలుగు ప్రజల అరచేతిలోకి వినోదాన్ని, తెలుగు వారికి అంతులేని అమితానందాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరో ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్ లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్నందించే విషయంలో ఎప్పటికప్పుడు తనతో తానే పోటీ పడుతూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్న ‘ఆహా ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ప్రియమణి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్) సమర్పణలో, అభిమన్యు దర్శకత్వంలో, SVCC Digital బ్యానర్ మీద భోగవల్లి బాపినీడు, ఈదర సుధీర్ నిర్మిస్తున్న ఫిలిం.. ‘భామా కలాపం’.

ఆదివారం ‘భామా కలాపం’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేసింది. ‘ప్రియమణి ఏం వండుతున్నారో తెలియదు కానీ, మనకి మాత్రం ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌ని వడ్డిస్తారు’ అంటూ ప్రోమోతోనే ఆకట్టుకుంది ‘ఆహా’ టీం. త్వరలో ‘భామా కలాపం’ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com