అజ్మన్‌లో ట్రాఫిక్‌ ఫైన్‌ నుంచి 923 డ్రైవర్స్‌ ఎస్కేప్‌

- March 26, 2016 , by Maagulf
అజ్మన్‌లో ట్రాఫిక్‌ ఫైన్‌ నుంచి 923 డ్రైవర్స్‌ ఎస్కేప్‌

అజ్మన్‌ పోలీసులు 923 మంది డ్రైవర్లను ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను పట్టుకున్నారు. వారం రోజులపాటు నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌లో ఇది చోటు చేసుకుంది. అయితే వారెవరికీ ఫైన్‌ విధించలేదు. చీఫ్‌ ఆఫ్‌ అజ్మన్‌ పోలీస్‌ బ్రిగేడియర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ నవౌమి మాట్లాడుతూ, డ్రైవర్లకు వారు ఉల్లంఘించిన నిబంధనల గురించి తెలియజేశామనీ, ఇకపై వారు నిబంధనల్ని ఉల్లంఘించరని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌ పోలీస్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన కెప్టెన్‌ ఫౌద్‌ అల్‌ ఖాజా మాట్లాడుతూ, వాహనదారుల్ని అలర్ట్‌ చేయడమే ఈ క్యాంపెయిన్‌ లక్షణమని, అరెస్టు చేయడం లేదా చలాన్లు విధించడం కాదని, ప్రతి ఒక్కరూ రోడ్‌ సేఫ్టీ రూల్స్‌ పట్ల అవగాహనతో ఉండాలని అన్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ పెట్రోల్స్‌ని ఏర్పాటు చేశారు. 'వీక్‌ వితౌట్‌ ఇర్రెగ్యులారిటీస్‌' పేరుతో ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com