గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం
- January 17, 2022
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.కరోనా మహమ్మారి రాష్ట్రంలో అడుగుపెట్టిననాటి నుంచి గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు.గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందిస్తోంది ప్రభుత్వం..ఇదే సమయంలో.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడుతుండడంతో.. మిగతా వారిలో ఆందోళన మొదలైంది.తాజాగా.. మరో 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు.. మరికొంత మంది వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన కరోనా టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉంది.కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.దీంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, రోగుల్లో ఆందోళన మొదలైంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి