డేంజర్ బెల్స్..నివసించలేని విధంగా మారుతున్న కువైట్

- January 17, 2022 , by Maagulf
డేంజర్ బెల్స్..నివసించలేని విధంగా మారుతున్న కువైట్

కువైట్: గ్లోబల్ వార్మింగ్...ఈ పేరు ప్రపంచ నేతలకు తలనొప్పిగా మారింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొని భావి తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 

1850 నుండి భూమిపై ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్న కాలిఫోర్నియాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ 'బర్కిలీ ఎర్త్', అత్యంత వేడిని నమోదు చేసిన సంవత్సరంగా 2021ను ఆరవ స్థానంలో నిలుపుతూ నివేదిక విడుదల చేసింది. అదనంగా, చైనా, ఇరాన్, ఉత్తర మరియు దక్షిణ కొరియా, సౌదీ అరేబియా మరియు బంగ్లాదేశ్‌తో సహా 25 దేశాలు తమ అత్యధిక వార్షిక సగటు ఉష్ణోగ్రతను నమోదు చేశాయి.

ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన కువైట్ కు గ్లోబల్ వార్మింగ్ శాపంలా తయారయింది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశం జీవించలేని విధంగా మారింది అనటంలో సందేహంలేదు.

2016లో ఉష్ణోగ్రతలు 54Cని తాకాయి. ఇది గడిచిన 76 ఏళ్లలో భూమిపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డ్ బద్దలుకొట్టింది. గత ఏడాది జూన్‌లో..సాధారణంగా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సమయానికంటే కొద్ది వారల ముందే  50 డిగ్రీల సెల్సియస్ కు వాతావరం చేరగా దానిని బహిర్గతం కానివ్వకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇక, కువైట్‌లోని కొన్ని ప్రాంతాలు 2071 నుండి 2100 వరకు ఇప్పటి ఉష్ణోగ్రతలకు మరో 4.5C వరకు పెరిగి, నివసించేందుకు వీలుగా ఉండవని పర్యావరణ శాఖ హెచ్చరిస్తోంది.
 
వన్యప్రాణులు దాదాపు అంతరించిపోయాయి. వేసవి నెలల్లో పైకప్పులపై చనిపోయిన పక్షులు..నీరు/నీడ లేక చావుబ్రతుకుల మధ్య కొట్టాడుతున్న పశువులతో కువైట్ లోని పశు వైద్యశాలలు నిండిపోతున్నాయి. అడవి నక్కలు కూడా కురిసే కొద్దిపాటి వర్షాల తర్వాత వికసించని ఎడారిని వదిలివేస్తున్నాయి. కువైట్ దేశంలో పశువులకు దాపురించిన ఈ పరిస్థితి..రాబోయే సంవత్సరాలలో ప్రజలకు వచ్చే ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది పర్యావరణ శాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com