యూఏఈ పై జరిగిన ఉగ్రదాడికి ఘాటైన సమాధానమిచ్చిన సౌదీ

- January 18, 2022 , by Maagulf
యూఏఈ పై జరిగిన ఉగ్రదాడికి ఘాటైన సమాధానమిచ్చిన సౌదీ

యూఏఈ: అబుధాబి పై జరిగిన ఉగ్రదాడి కి సమాధానంగా గడిచిన 24 గంటల్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం సోమవారం యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులపై ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది సైనిక వాహనాలు ధ్వంసమవ్వగా 80కి పైగా స్థావరాలు అంతమొందాయని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ట్విట్టర్‌లో తెలిపింది.

"మేము గత 24 గంటల్లో మారిబ్‌లో మిలీషియా లక్ష్యంగా 17 దాడులు నిర్వహించాము" అని ట్వీట్‌లో పేర్కొంది.

ఇరాన్ మద్దతుతో యెమెన్ లోని హౌతీ మిలిటంట్లు యూఏఈ రాజధాని అబుధాబి లో డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, ఆరుగురు గాయపడిన నేపథ్యంలో తాజా దాడులు జరిగాయి.

ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది యూఏఈ. "పిరికి" ఉగ్రవాద చర్యగా పేర్కొన్న ఈ చర్యకు "ప్రతిస్పందించే హక్కు" ఉందని నొక్కి చెప్పింది.

సనాలో వైమానిక దళం 24 గంటల వైమానిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని మరియు ప్రజలు వారి భద్రత దృష్ట్యా హౌతీ మిలీషియా శిబిరాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది అరబ్ సంకీర్ణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com