తెలంగాణలో కరోనా విజృంభణ
- January 21, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ , మరోవైపు కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4,416 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,819 కాగా, మరణాల సంఖ్య 4,069 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,93,623 ఉండగా, తాజాగా 1920 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 95.43 శాతం ఉంది.ఇక ఐసోలేషన్లో 29,127 మంది ఉన్నారు.
ఒక వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..