దుబాయ్ రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న మానసిక రోగి అరెస్ట్

- January 22, 2022 , by Maagulf
దుబాయ్ రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న మానసిక రోగి అరెస్ట్

దుబాయ్: మెరీనా ప్రాంతంలోని జేబీఆర్ ప్రాంతంలో నగ్నంగా తిరుగుతున్న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అరబ్ సందర్శకుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న సదరు వ్యక్తి సెక్యూరిటీ గార్డు, ఫుడ్ డెలివరీ డ్రైవర్‌పై కూడా దాడి చేశాడు. అతను తీవ్ర మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది. దుబాయ్ పోలీసులు అతనిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. యూఏఈలో పబ్లిక్ ప్లేస్ లలో ఏదైనా అసభ్యకరమైన చర్యకు పాల్పడితే శిక్షార్హమైన నేరం కింద పరిగణిస్తారు. UAE శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 358 ప్రకారం ఎవరైనా బహిరంగంగా అసభ్యకరమైన చర్యకు పాల్పడితే 1,000 Dhs నుంచి 50,000 Dhs మధ్య జరిమానా విధిస్తారు. అదే తప్పు పునరావృతం అయినట్లయితే, శిక్ష మూడు నెలల వరకు జైలు శిక్ష, 100,000 Dhs కంటే ఎక్కువ జరిమానా లేదా రెండూ విధించే అవకాశ ఉంది. ప్రైవేట్ స్థలంలో కూడా, పదిహేనేళ్ల లోపు వయస్సు ఉన్న ఆడపిల్ల లేదా అబ్బాయి పట్ల ఎవరైనా అసభ్యకరమైన చర్యకు పాల్పడితే, కనీసం ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com