మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
- January 26, 2022
హైదరాబాద్: ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు.రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు.
”నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లక్షణాలతో కరోనా సోకింది.నిన్న రాత్రి కరోనా అని తెలియడంతో నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను.ఇటీవల నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోండి. త్వరలోనే మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను” అని చిరంజీవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.చిరంజీవికి కరోనా రావడంతో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్స్ వాయిదా పడనున్నాయి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







