ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రయాణీకుల రుసుము: ఖతార్ ఎయిర్‌పోర్ట్స్
- January 26, 2022
దోహా: ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల సర్క్యులర్ (2)ని విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల్లో కొత్త సర్వీసు రుసుము ప్రవేశ పెట్టడానికి సంబంధించిన అమెండ్మెంట్ ఇది. ఈ మేరకు అందరు ఎయిర్ లైన్ మేనేజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రయాణీకుల రుసుముని రివ్యూ చేసి, కొత్తగా ప్రయాణీకుల రుసుముని తెరపైకి తెచ్చింది. ఎయిర్ ఫ్రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుసుము అలాగే సెక్యూరిటీ రుసుముని అదనంగా కలిపారు. ఒక వ్యక్తికి 24 గంటల వరకు60 క్యుఎఆర్ వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి రుసుముగా పేర్కొన్నారు. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి 10 క్యుఎఆర్ వసూలు చేస్తారు. రెండేళ్ళ లోపు చిన్నారులకు ఈ ఫీజు నుంచి వెసులుబాటు వుంటుంది. ఇన్ కమింగ్ అలాగే ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్ల కోసం 10 క్యుఎఆర్ (మెట్రిక్ టన్నుకి) వసూలు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







