ఎన్‌పిఆర్ఎ నిధుల కుంభకోణం: ప్రభుత్వోద్యోగికి ఏడేళ్ళ జైలు శిక్ష

- January 28, 2022 , by Maagulf
ఎన్‌పిఆర్ఎ నిధుల కుంభకోణం: ప్రభుత్వోద్యోగికి ఏడేళ్ళ జైలు శిక్ష

మనామా: నాలుగవ హై క్రిమినల్ కోర్టు ఓ ప్రభుత్వోద్యోగికి ఏడేళ్ళ జైలు శిక్ష, 1,408 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించింది. ఈ కేసులో రెండో అనుమానితుడికి సంబంధించిన విచారణ కొనసాగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నేషనాలిటీ పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్‌ విభాగానికి సంబంధించిన నిధుల్ని నిందితులు కొల్లగొట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ నిమిత్తం ఎన్‌పిఆర్ఎ రుసుముల్ని వసూలు చేస్తోంది. 23 లావాదేవీల ద్వారా 1,472 బహ్రెయినీ దినార్లను ఫీజుగా వసూలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com