దుబాయ్ చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్
- January 30, 2022
దుబాయ్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దుబాయ్ చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ట్రీట్ మెంట్ పొందిన అనంతరం కేరళకు తిరిగి రావాల్సి ఉంది. అయితే, ఎక్స్ పో 2020 దుబాయ్‌లో పినరయి 'కేరళ వీక్'ను ప్రారంభించేందుకు దుబాయ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా పెవిలియన్‌లో కేరళ వీక్ ను ఆయన ప్రారంభించి ఫిబ్రవరి 7న కేరళకు పినరయి తిరిగి వెళ్లనున్నట్లు సమాచారం. మార్చి 2020లో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత విజయన్ యూఏఈకి రావడం ఇదే తొలిసారి. వరల్డ్ ఫెయిర్‌లో భాగంగా ఇండియా పెవిలియన్ ప్రస్తుతం హెల్త్ అండ్ వెల్‌నెస్ థీమ్ వీక్ కోసం ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. శుక్రవారం పెవిలియన్‌లో వైద్య పరికరాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలపై ప్యానెల్ చర్చ జరిగింది. వర్చువల్ ఈవెంట్‌లో పలువురు ప్రభుత్వ, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ మాట్లాడుతూ.. వైద్య పరికరాల రంగం వృద్ధి పథంలో పయనిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలను తీర్చే సామర్థ్యం స్థానిక పరిశ్రమలకు ఉందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









