కువైట్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ రీస్టోర్డ్
- January 30, 2022
కువైట్: ఇంటర్నెట్ సర్వీసులను కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సిట్రా) తిరిగి ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్ అంతరాయంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సభ్య దేశాల మధ్య కమ్యూనికేషన్‌లు ప్రభావితం కాలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ఇతర అంతర్జాతీయ మార్గాలు, కేబుల్స్ ను ఉపయోగించడం ద్వారా తక్కువ వ్యవధిలో సమస్యను పరిష్కరించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్‌లోని మస్కట్ నగరానికి 183 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ వైపు వెళుతున్న కేబుల్ ఫాల్కన్ జలాంతర్గామి కారణంగా కట్ అయిందని, మరొకటి సైనిక కార్యకలాపాల కారణంగా మస్కట్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు వెళుతున్న కేబుల్ కట్ అయిందని నిర్వాహణదారు జీసీఎక్స్ కంపెనీ చెప్పిందని సిట్రా పేర్కొంది. మార్చి 2021 నుండి కొత్త అంతర్జాతీయ ల్యాండ్, సీ కేబుల్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సిట్రా వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









