అబుధాబి బిగ్ టికెట్: భారతీయ మహిళకు జాక్‌పాట్..
- February 04, 2022
అబుధాబి: అబుధాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయురాలు లీనా జలాల్ తాజాగా బిగ్ టికెట్ విజేతగా నిలిచింది.కేరళలోని త్రిచూర్‌కు చెందిన జలాల్ నిన్న అబుధాబిలో జరిగిన డ్రాలో 22 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకుంది.లీనా జలాల్ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇటీవల కొనుగోలు చేసిన టికెట్ నం.144387 వారికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.లీనా గెలిచిన భారీ నగదును వీరందరూ సమానంగా పంచుకోనున్నారు. ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల లీనా ఆనందం వ్యక్తం చేసింది. "నోట మాట రావట్లేదు. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది. బిగ్ టికెట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు" అని లీనా చెప్పింది. లీనా మరియు ఆమె స్నేహితులు గెలుపొందిన మొత్తంతో ఏమి చేయాలో ఇంకా ప్లాన్ చేయలేదు, కానీ వారు దాంట్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పింది.కాగా, ఆమె ప్రస్తుతం అబుధాబిలో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్‌గా విధులు నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!