కాజల్ కు యూఏఈ గోల్డెన్ వీసా

- February 05, 2022 , by Maagulf
కాజల్ కు యూఏఈ గోల్డెన్ వీసా

దుబాయ్: మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్లే దేశాల్లో దుబాయ్ ఒకటి.దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి, సెలబ్రిటీలకు, దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లకి అక్కడి ప్రభుత్వం స్పెషల్ వీసాలు జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాలు కూడా అతి తక్కువ మందికి జారీ చేస్తారు.ఈ స్పెషల్ వీసాని ‘గోల్డెన్‌ వీసా’ అంటారు.

ఈ గోల్డెన్ వీసా ఉంటే దుబాయ్ కి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లొచ్చు, రావొచ్చు ఎలాంటి వీసా ప్రాసెస్ లేకుండా.మన ఇండియాకి సంబంధించి చాలా తక్కువ మందికి ఈ ‘గోల్డెన్ వీసా’ని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చింది.కొంత మంది బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ సినీ ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా లభించింది. సౌత్ సినిమా స్టార్స్ లో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌ లాంటి స్టార్స్ కి మాత్రమే ఈ గోల్డెన్ వీసా లభించింది.

తాజాగా ఈ గోల్డెన్ వీసా కాజల్ అగర్వాల్ ని వరించింది. కాజల్ పెళ్లి చేసుకొని సినిమాలు చేస్తూ బిజినెస్ చూసుకుంటుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకి దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ తాజాగా ఈ గోల్డెన్ వీసాని దుబాయ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ తన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్‌ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది.నాకు ఈ గుర్తింపు ఇచ్చిన యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కాజల్‌ పోస్ట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com