'ఎఫ్ 3' ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

- February 06, 2022 , by Maagulf
\'ఎఫ్ 3\' ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది.ఇది ఒక ఎనర్జిటిక్ సాంగ్… వెంకీ మామ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు.

వరుణ్ తన శిష్యులతో డ్యాన్స్ చేస్తున్న స్వామీజీని పోలిన గెటప్‌లో సరికొత్తగా కన్పించాడు. ట్యూన్, గాత్రం డబ్బు ప్రాముఖ్యత గురించి హై వోల్టేజ్ ఎనర్జిటిక్ సాంగ్‌ ద్వారా వెల్లడించారు. చిన్న ప్రోమో సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com