వర్క్ మోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి!
- February 06, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పిన చిరంజీవి..అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి.అన్నిటికి డేట్స్ ఇస్తున్న చిరుకి ఇటీవల కరోనా రావడంతో ఒక్కసారిగా అన్నిటికి బ్రేక్ పడింది.రెండు వారాలుగా రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తనకు కరోనా తగ్గిపోయిందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.
కరోనా తగ్గడంతో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటున్న చిరంజీవి.. ఈసారి పూర్తి స్టీమ్‌తో తిరిగి పనిలోకి వెళ్లినట్లు ట్వీట్ చేశారు. నేను కోలుకునేలా చేసిన మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో షూటింగ్ స్పాట్ నుండి తీసిన వర్కింగ్ ఫోటోలను కూడా జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మళ్ళీ కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొటుండగా.. ఈ సినిమా షూట్ కోసం నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చింది. ఒక వైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో వైపు రాత్రి పూట ఆచార్య సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. మరోవైపు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో సినిమాకి ఒకేసారి షూటింగ్ షెడ్యూల్ సిద్ధం చేయనున్నారట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..