2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
- February 06, 2022
‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేయాలని అధికార వర్గాలు తెలిపాయి. ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
లతా మంగేష్కర్ మృతిపట్ల దేశవిదేశాల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. మరికాసేపట్లో పెద్దార్ రోడ్ లోని తన నివాసానికి లతామంగేష్కర్ భౌతికకాయం చేరనుంది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు ప్రజలకు అనుమతివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. శివాజీ పార్కులో సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!