మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
- February 09, 2022
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఫిబ్రవరి 14న ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రమోగం ద్వారా 1,710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు శాలిలైట్లను పీఎస్ఎల్వీ తనతో పాటు నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈఓఎస్-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్ లకు సంబంధించి ఈ శాటిలైట్ హై క్వాలిటీ ఇమేజెస్ ను తీసి, పంపిస్తుంది.
మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటి ఇన్స్పైర్ శాట్-1. దీన్ని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ పేరు ఐఎన్ఎస్-2టీడీ. ఇది ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అప్రూవల్ లభించిన తర్వాత 25 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







