దుబాయ్ లో ఫిబ్రవరి 15 నాటికి ఆంక్షలు ఎత్తివేత
- February 10, 2022
దుబాయ్: ఎమిరేట్‌లోని అన్ని కోవిడ్ -19 ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 15 నాటికి దుబాయ్‌లో అన్ని కార్యకలాపాలు, ఈవెంట్లు, సామాజిక సమావేశాలు క్రమంగా పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉంది. కరోనా ముప్పు పోలేదని, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు మాస్కులు ధరించడం సహా అన్ని నివారణ చర్యలకు కట్టుబడి ఉండాలని సుప్రీం కమిటీ సూచించింది. బుధవారం దేశంలో 1,538 కొత్త కరోనావైరస్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 862,514, మరణాల సంఖ్య 2,273కు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక టీకా రేట్ ను ఎమిరేట్స్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







