విదేశీ డ్రోన్ల కొనుగోళ్లను నిషేదించిన ఇండియా
- February 10, 2022
విదేశీ డ్రోన్ల కొనుగోలును భారత ప్రభుత్వం నిషేదించింది. దేశీయంగా తయారుచేసిన డ్రోన్లను ప్రమోట్ చేయడంలో భాగమే ఈ ప్రయత్నం అని పేర్కొంది. R&D, డిఫెన్స్, సెక్యూరిటీ ప్రయోజనాల కోసం డ్రోన్లను దిగుమతి చేసుకోవడాన్ని అందులో మినహాయింపు ఇచ్చారు. కానీ అటువంటి దిగుమతుల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. డ్రోన్ల ఎగుమతిని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిషేదించినట్లుగా పేర్కొంది.
‘పూర్తిగా తయారైన డ్రోన్ ల దిగుమతి పాలసీని పూర్తిగా నిషేదించారు. కాకపోతే డ్రోన్ల విడి భాగాలు కావాలంటే ఎటువంటి అప్రూవల్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు’ అని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది.
గవర్నమెంట్ సంస్థలు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు దక్కించుకున్న విద్యా సంస్థలు, R&D సంస్థలు డ్రోన్లను దిగుమతి చేసుకోవచ్చు. CBU, SKD, CKD రూపంలో మాత్రమే వాటిని అనుమతిస్తారు. దిగుమతి చేసుకోదలచిన వారు సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి.
ఆగష్టు 2021న రిలీజ్ చేసిన డ్రోన్ రూల్స్ కు 2022 ఫిబ్రవరి 9 నుంచి ఈ నిషేదం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







