పెరూలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు..20 మంది మృతి

- February 11, 2022 , by Maagulf
పెరూలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు..20 మంది మృతి

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్‌ రీజియన్‌లో ఓ బస్సు రోడ్డుపై నుంచి ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందారు. మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నాం రిమోట్ నార్త్ లిబర్టాడ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం విషయాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు తెలిపారు.

కాగా బస్సు తయాబాంబా నుంచి ట్రుజిల్లోకు ప్రయాణిస్తోండగా ఈ దుర్ఘటన జరిగిందనీ..సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి బస్సు పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదం బస్సు నుజ్జునుజ్జయిందని, నాలుగేళ్ల చిన్నారితో సహా 20 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

కాగా రోడ్లు సరిగా లేక గుంతలు గుంతలుగా మారిపోవటంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉండటం..అధిక వేగం, ప్రమాద సూచికలు లేకపోవడం వల్ల కూడా తరచు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. 2020 నవంబర్ 10న ఉత్తర పెరూవియన్ జంగిల్‌లో ఇటువంటి ప్రమాదమే జరిగింది.

ఓ మినీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ బస్సు ప్రమాదానికి కూడా రహదారులు సరిగాలేకపోవటమే కారణమంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com